చరణ్‌ను అలా అనొద్దు రోజా..

232
chiru
- Advertisement -

ఖైదీ నెంబర్ 150 మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవి బిజీ అయిపోయాడు. టీవి ఛానల్స్‌కు..న్యూస్ పేపర్స్ కు ఇంటర్ వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే చిరంజీవిని సినీనటి..ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ చేశారు. రోజా ఇంటర్ వ్యూ చేస్తుందని తెలిసిన చిరు..కాస్త ఎగ్జైట్ గా ఫీలైయ్యాడు. నువ్వు ఇంటర్ వ్యూ చేస్తున్నావా అనగానే రోజా సర్‌ప్రైజ్‌ అంటూ చిరుకు షాక్ ఇచ్చింది. గతంలో రోజా, చిరుతో హీరోయిన్‌గా చేయడంతో..పాత విషయాలను గుర్తు చేసుకుంటు..ఖైదీ సినిమా ప్రమోషన్ ఇంటర్ వ్యూ ను ముగించేశారు. అయితే రోజా ఓ ప్రశ్న వేస్తు…’మీ ఇంట్లో అందరూ హీరోలైపోయారు కదా? ప్రధానంగా బంగారు కోడిపెట్ట పాటను రామ్ చరణ్ గారు రీమేక్ చేస్తున్నప్పుడు మీరెలా ఫీలయ్యారు?’ అంటూ ప్రశ్నించింది. వెంటనే అందుకున్న చిరంజీవి… ‘హే రోజా! ఊరుకో…వాడిని గారు అంటావేంటి?’ అని వారించారు. ‘పిల్లాడిగా వున్నప్పుడు వాడిని ఎత్తుకున్నావు… చరణ్ అను చాలు’ అని సూచించారు.

chiru

తన బంగారు కోడిపెట్ట పాటను వాడు రీమేక్ చేసినప్పుడు ఆందోళన చెందినా, అద్భుతంగా చేశాడని, దానిని చూసిన తరువాత చాలా గర్వపడ్డానని చిరంజీవి అన్నారు. తన కంటే ఎక్కువ సురేఖ సంతోషించిందని ఆయన చెప్పారు. దాంతో ఎవరు బాగా చేశారని సురేఖను అడిగితే… ‘ఇంకెవరు నా కొడుకే’ అంటూ మురిసిపోయిందని చిరంజీవి తెలిపారు. ఎంతైనా తల్లీకొడుకులు కదా? అంటూ ఆయన నవ్వేశారు. దీంతో రోజా కూడా నవ్వేసింది.

- Advertisement -