అవును…డేటింగ్‌లో ఉన్నా

80
I am always dating a businessman from London

వ్యాపారవేత్తతో డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌ స్పందించారు. తాను ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌ చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న సోనమ్…కరణ్‌జోహర్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. లండన్‌కి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్‌ చేస్తున్నానని…. ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయండి. నా పర్సనల్‌ విషయాల గురించి అంతకంటే ఎక్కువగా ప్రస్తావించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే దాన్ని నేను చాలా పవిత్రంగా భావిస్తున్నా. కాబట్టి నా వ్యక్తిగత విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు అని చెప్పుకొచ్చింది‌.

సోనమ్‌ కపూర్… ఆనంద్‌ అహూజాతో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరుస్తు ఆనంద్‌తో కలిసి చక్కర్లు కొట్టడం…దీంతో అతనికి సంబంధించిన భానే దుస్తుల బ్రాండ్‌నే ధరిస్తుండటం ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది.

గతంలో సెక్స్‌పై ఈ బ్యూటీ సెక్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తనకు సెక్స్ అంటే ఇష్టమేనని…కానీ సహానటులతో కాదని బోల్డ్‌గా చెప్పేసింది. ఇప్పటి వరకు నా కో-స్టార్స్ ఎవరితో డేటింగ్ చేయలేదని…. ఎవరితోనూ నాకు సెక్సువల్ రిలేషన్స్ కూడా లేవని చెప్పిన సంగతి తెలిసిందే.