బాలీవుడ్‌లో ‘భీష్మ’ రీమేక్..?

156
Bheeshma

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘భీష్మ’. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించడంతో, నితిన్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనుట్లు సమాచారం. ఈ మూవీని కరణ్ జొహార్ రీమేక్‌ చేయనున్నాడట.. ఇందులో హీరోగా రణ్ బీర్ కపూర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో ఈ మధ్య కాలంలో భారీ విజయాలను సాధించిన చిత్రాలను హిందీలో రీమేక్ చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇదివరకే ‘అర్జున్ రెడ్డి’ అక్కడ ‘కబీర్ సింగ్’ గా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, ఈ పోటీ మరింత పెరిగింది. ‘జెర్సీ’ .. ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాలు కూడా హిందీ రీమేక్స్ గా రూపొందుతున్నాయి. ఆ జాబితాలోకి ‘భీష్మ’ కూడా చేరిందనేది తాజా సమాచారం.