151కి చిరు రెడీ….!

106

మెగాస్టార్‌ చిరంజీవి సుదీర్ఘకాలం తర్వాత వెండితెరపై ఏ మాత్రం తన నటనలో మార్పు రాకుండా అదే స్థాయిలో నటించాడు. తొమ్మిది సంవత్సరల తర్వాత కూడా అమ్మడు లెట్స్‌డూ కుమ్ముడు అంటూ యంగ్‌ హీరోల స్టేపు లేశాడు. దశాబ్దం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. సినిమా టీజర్‌ దగ్గర నుంచి మొదలు విడుదల వరకు నానా హంగామా చేస్తుంది ఖైదీనెంబర్ 150. చిరు రీఎంట్రీ పై మెగా అభిమానులే కాదు టాలీవుడు దర్శకులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

రాంచరణ్ నిర్మాతగా అడుగువేసిన మొదటి సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగానే హిట్ అవడం… భారీగా కలెక్షన్లు రాబట్టడం ఇదంతా ఒక పండుగల ఉందని మెగాఫ్యామిలి మెంబర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారట.

 Chiru 151 Film

ఖైదీ సినిమాతో జోష్‌ మీద ఉన్న చిరు 151చిత్రాన్ని కి సిద్ధమైయ్యడట. ఈసినిమాని కూడా రాంచరణ్‌ నిర్మిస్తాడని తెలుస్తొంది. 151వ సినిమా మార్చి 27న లాంచ్‌ చేయాలని భావిస్తుందట యూనిట్. వేసవికాలంలో మొదలు కానున్న ఈ సినిమా షూటింగ్‌ని త్వరతగతిన పూర్తి చేసి ఈఏడాది చివరలో మెగా అభిమానులకు మరో బంఫర్‌ గిప్ట్‌గా ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.

 Chiru 151 Film

అయితే తాజా ఫిల్మ్‌నగర్‌ల వర్గాల సమాచారం ప్రకారం చిరు 150వ సినిమా కంటే ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చిరు విన్నానడట. అయితే ఇప్పుడు అదే కథతో తన 151వ సినిమా చేయలని చిరు భావిస్తున్నాట్లు సమాచారం. అలాగే సురేందర్‌రెడ్డితో పాటు బోయపాటి చెప్పిన స్టోరి కూడా విన్న చిరు అది కూడా బాగుందని చెప్పడట. మరి ఈ151 చిత్రాన్నికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తాడా లేక బోయపాటి శ్రీను టేకప్‌ చేస్తాడా అనిదే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికి టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాటల ప్రకారం చిరు 151వ సినిమా ఉయ్యాల వాడ నరసింహారెడ్డితోనే చేసే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాట్లు సమాచారం.