10 వరకు నుమాయిష్‌ మూసివేత

20
numaish

ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్ రెండు రోజులకే మూతపడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

జనవరి 1న నుమాయిష్ ప్రారంభంకాగా రెండో రోజైన ఆదివారం పోటెత్తారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 10 వేల మందికి పైగా సందర్శకులు తరలివచ్చారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నుమాయిష్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నుమాయిష్‌ను పదో తేదీ వరకు మూసివేసి ఉంచుతామని, అప్పటివరకు సందర్శకులెవరూ రావొద్దని నిర్వాహకులు ప్రకటించారు.