భారీగా తగ్గిన బంగారం ధరలు..

189
gold rate

పసిడి ప్రేమికులకు శుభవార్త…బంగారం ధర భారీగా పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.780 పడిపోగా ధర రూ.55,460కు చేరాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.720 తగ్గి రూ.50,840కు చేరింది.

బంగారం బాటలోనే కేజీ వెండి ధర ఏకంగా రూ.1100 తగ్గి రూ.67,000కు చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.65 శాతం పెరిగి 1959 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 1.43 శాతం పెరుగుదలతో 27.53 డాలర్లకు చేరింది.