మంటల్లో చిక్కుకున్న వారి వివరాలివే…

125
jaga

శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుదుత్ప‌త్తి కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. సీఎండి ప్రభాకర్ రావుతో కలిసి క్షతగాత్రులను పరామర్శించిన జగదీష్ రెడ్డి…లోపలున్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ప్రమాదంలో ప‌ది మంది బయటకు రాగా, మ‌రో తొమ్మిదిమంది లోపల చిక్కుకుపోయార‌ని……..అగ్నిమాప‌క సిబ్బంది‌, పోలీసులు మూడుసార్లు లోపలకు వెళ్లార‌ని, పొగ కారణంగా వెనక్కు వచ్చారని తెలిపారు. ప్రమాదంతో విద్యదుత్పత్తి ఆగిపోయిందని, కోట్లలో నష్టం వాటిల్లిందని చెప్పారు.

లోపల చిక్కుకున్న 9 మంది వివరాలు…
1.DE శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్
2.AE వెంకట్ రావు పాల్వంచ
3.AE మోహన్ కుమార్ హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా హైదరాబాద్
5.AE సుందర్ సూర్యాపేట
6.ప్లాంట్ అటెండెంట్ రాంబాబు ఖమ్మం జిల్లా

  1. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ పాల్వంచ
    8,9 హైదరాబాద్ కు చెందినా ఆమెరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగులు వినేష్ కుమార్,మహేష్ కుమార్.