ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన…

167
telangana

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.ఈ పథకాన్ని ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు(9,486) ధరఖాస్తులు అన్ లైన్ లో నమోదు కావడం గమనార్హం.

మీసేవ కేంద్రాల, ఇతర ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసుల ద్వారా విరివిగా దరఖాస్తులు అందుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.ఇప్పటివరకు అందిన 9,486 దరఖాస్తు ద్వారా అడ్వాన్స్ కింద రూ.96 లక్షల మేరకు సంబంధిత ఖాతాలో చేరినట్లు అధికారులు వెల్లడించారు.

ఎల్.అర్.ఎస్ అంశంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నందనేందుకు వస్తున్న దరఖాస్తులు నిదర్శనమని చెప్పవచ్చు.దరఖాస్తుల వివరాలు..గ్రామ పంచాయతీలలో 2,946 దరఖాస్తులు.మున్సిపల్ కార్పోరేషన్లలో 2,316 దరఖాస్తులు.మున్సిపాలిటీల్లో 4,224 దరఖాస్తులు వచ్చాయి.