మంత్రి పువ్వాడకు శుభాకాంక్షల వెల్లువ..

112
puvvada ajay

రవాణా శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు . ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు , పువ్వాడ అభిమానులు సంబురాలు జరుపుకున్నారు.

కేక్ కట్టింగులు , పాలాభిషేకాలతో సందడి చేశారు .. మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం లో పువ్వాడ అజయ్ కుమార్ , సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు.

టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి నేతృత్వంలోని బొమ్మెర సేవాదళం ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు జరిపి , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.