రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు సెల‌వులు..

166
telangana registrations

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవులు ప్రకటించింది. రేపటి (మంగళవారం) నుండి సెలవులు వర్తిస్తాయని తిరిగి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు సెలవులు అమల్లో ఉంటాయని తెలిపింది. కొత్త రెవెన్యూ చ‌ట్టం దృష్ట్యా ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రిజిస్ర్టేష‌న్లు నిలిపివేశామ‌ని కమిషనర్ చిరంజీవులు తెలిపారు.

స్టాంపుల కొనుగోలు, చ‌లాన్లు చెల్లించిన వారికి ఇవాళ రిజిస్ర్టేష‌న్లు అవుతాయ‌ని చిరంజీవులు ప్ర‌క‌టించారు. నేటి నుంచి స్టాంపుల ‌విక్ర‌యాలు పూర్తిగా నిలిపివేశామ‌ని …మంగ‌ళ‌వారం నుంచి పూర్తిగా రిజిస్ర్టేష‌న్లు ఆగిపోతాయ‌ని పేర్కొన్నారు.