రిజిస్ట్రేషన్స్‌…ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్

62
Telangana

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు పాత పద్దతిలోనే జరుగుతున్నాయి. టోకెన్‌ పద్ధతిలో ‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌’ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరగనుండగా ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 54 రకాల సేవలను అందించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (టీపిన్‌) లేదా ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (టీపీఐఎన్‌)అవసరం లేదని … ఆధార్‌ తప్పనిసరి కాదని అధికారులు తెలిపారు.

స్థిరాస్తి క్రయ, విక్రయదారులు తమ దస్తావేజులో ఏమైనా పొరపాట్లు ఉన్నా, అనుమానాలున్నా ఎవరి ప్రమేయం లేకుండా సబ్‌రిజిస్ట్రార్లను నేరుగా సంప్రదించి పూర్తి విశ్వాసంతో రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకోవచ్చని ఉన్నతాధికారులు సూచించారు. స్లాట్‌ బుకింగ్‌ అవసరం లేదని స్పష్టంచేశారు.

అధికారికంగా అనుమతించిన లేఅవుట్లలోని భవనాలు, ప్లాట్లు, ఫ్లాట్లు ఇతర స్థిరాస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అనధికార లేఅవుట్లలోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతానికి ఆస్కారం లేదని అధికారులు స్పష్టంచేశారు.