ట్రెండింగ్‌లో #Gangavva!

153
gangavva

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. 16 మంది కంటెస్టెంట్స్‌ బిగ్ హౌస్‌లోకి అడుగుపెట్టగా 16వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గంగవ్వ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన గంగ‌వ్వ తన యాసతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

60 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న గంగ‌వ్వ తొలిసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా ఆమెకు సపోర్ట్ చేసే వారి సంఖ్య గంటగంటకు పెరిగిపోతూనే ఉంది. . #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ ఆమె గెలుపుకోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా పొలాసలో పుట్టింది గంగవ్వ. హౌస్‌లోకి ఎంటరయ్యే ముందు తన కష్టాలను చెప్పుకున్న గంగవ్వ…ఈ షో ద్వారా వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు,తినడానికి తిండి ఉంటే చాలని చెప్పడం అందరిని కదిలించింది.