మహర్షి మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. రైతుల గురించి ఒక అద్భుతమైన సబ్జెక్టును తన సినిమా ద్వారా చెప్పడంతో పాటు ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం మహర్షి సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న వంశీ..అలీతో సరదాగా షోలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన ఫస్ట్ సినిమా మున్నా ఫ్లాప్ కావడం నిరాశపర్చిందన్నారు. తనకు మంచిమిత్రుడైన ప్రభాస్‌కు ఫ్లాప్ ఇవ్వడంపై గిల్టీగా ఫీలయ్యానని తెలిపారు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు ఎలాంటి సినిమాలు చేయలేదని కానీ సినిమా చేస్తే పెద్ద హీరోతోనే చేయాలని డిసైడ్ అయ్యానని చెప్పారు. అనుకున్నట్లుగా ఎన్టీఆర్‌తో బృందావనం సినిమాతో సక్సెస్ కొట్టానని చెప్పారు. భవిష్యత్‌లో ప్రభాస్‌కు హిట్ ఇస్తానని చెప్పారు.
మాది ఫన్నీ లవ్ స్టోరీ అని చెప్పిన వంశీ… భద్ర సినిమాకి అసోషియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో మాలినిని చూశానని తెలిపారు. క్యాస్ట్యూమ్ డిజైనర్ శ్వేతా ఫ్రెండ్ మాలిని..ఆమె భద్ర సినిమా సెట్స్‌కి మాలిని తీసుకువచ్చారని వెల్లడించారు. అదే రోజు మాలిని బర్త్ డే. షూటింగ్ హడావిడిలో ఉన్నా.. శ్వేతా.. మాలిని పరిచయం చేసింది. ఆ తరువాత వాళ్లు వెళ్లాలంటే కారు రప్పించి పంపించేశా. అయితే శ్వేత.. మాలినితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను ఫోన్ తీసుకుని బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని అడగటంతో ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయని చెప్పారు.
దేవుడికి నేను థాంక్స్ చెప్పేది ఇంత మంచి భార్యను పేరెంట్స్‌ని ఇచ్చినందుకే. సక్సెస్ అనేది ఈరోజు ఉండొచ్చు తరువాత పోవచ్చు.. కాని దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ మనం సక్సెస్‌లో ఉన్నా లేకపోయినా.. మనవెంటే ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు.తన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుంది? ఎలాంటి సినిమా చేయబోతున్నాను అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.