అలీతో షోకి పవన్‌..!

131
ali
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో పవన్ – అలీ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ చేసే ప్రతీ సినిమా అలీ ఉండటం ఖాయం. ఈ విషయాన్ని పలు వేదికలపై పవన్ స్వయంగా వెల్లడించారు. తొలిప్రేమ దగ్గరి నుండి వీరి స్నేహబంధం కొనసాగుతుండగా ఇటీవల వీరి ఫ్రెండ్‌ షిప్ చెడిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా విడుదలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌ సినిమాల్లో అలీ లేకపోవడం అలాగే వైసీపీలో అలీ చేరడంతో వీరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు పవన్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌ రెండూ సీరియస్ సినిమాలని, వాటిలో కామెడీకి స్కోప్ లేదని అందుకే తాను నటించలేదన్నారు. పవన్ తర్వాత చేయబోయే సినిమాల్లో కచ్చితంగా తాను ఉంటానని.. తమ మధ్య ఏ గ్యాప్ లేదని వెల్లడించారు.

ఇక అలాగే తన షో అలీతో సరదాగాకు పవన్ వచ్చే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -