నా బాయ్ ఫ్రెండ్ ఇతనేః పాయల్ రాజ్ పుత్

563
payal-rajput_
- Advertisement -

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 మూవీలో తన అందం నటనతో యూత్ ను ఆకట్టుకుంది. ఈమూవీ తర్వాత ఆర్డీఎక్స్ 100, వెంకీమామ, డిస్కో రాజా మూవీలో నటించింది. ఇక పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు నచ్చిన అంశాలను అభిమానులతో షేర్ చేస్తుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. అతనితో గడిపిన కొన్ని ఫోటోలను ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది.

సౌరభ్ డింగ్రా అనే వ్యక్తితో పాయల్ ప్రేమలో ఉంది. చాలా కాలం నుంచి అతనితో డేటింగ్ చేస్తుంది పాయల్. సౌరభ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి పార్టీలో ఎంజాయ్ చేశారు. అతనితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో మరెవరూ లేరు. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే’ అని ట్వీట్ చేసింది పాయల్. మాములుగా అయితే సెలబ్రెటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కాడా చెప్పరు..కానీ పాయల్ ఏకంగా బాయ్ ఫ్రెండ్ ను అభిమానులకు పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చింది.

Payal Tweet

- Advertisement -