చిరంజీవి సినిమాలో మోహన్ బాబు!

467
Chiranjeevi Mohan Babu
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈమూవీ షూటింగ్ జరుపుకుటుంది. ఈమూవీలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడని సమాచారం. ఇందుకోసం 40రోజులు టైం కేటాయించాడని తెలుస్తుంది.

ఇక రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ నటించనుందని ఫిలీం నగర్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా ఈమూవీ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించనున్నాడని సమచారం. అయితే తాజాగా ప్రచారం పై స్పందించారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని అన్నారు. కాగా ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -