అక్రమ సంబంధాల కథ కాబట్టే హిట్!

41
- Advertisement -

పాయల్ రాజపుత్ నటించిన ‘మంగళవారం’ సినిమా హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు అదే ఇండస్ట్రీ జనానికి అయోమయాన్ని సృష్టిస్తోంది. అసలు ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యింది ? అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్. సినిమాలో గొప్ప కథ లేదు. అక్రమ సంబంధాల సమ్మేళనంగా వచ్చిన ఈ బోల్డ్ క్రైమ్ డ్రామాలో చెప్పుకోవడానికి గొప్ప సీన్ కూడా లేదు. అయినా, సినిమా మాత్రం చాలా బాగా ఆడింది. పైగా, తెలుగులోనే కాదు ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి గా నిలిచిపోయే స్థాయి ఉన్న సినిమా ఇది అంటున్నారు.

ఏమిటో.. ఎందుకు దీన్ని గొప్ప సినిమా అంటున్నారు అంటే, అంతుబట్టడం లేదు. ఒక అమ్మాయి పది మందితో పడుకోవడం అనే “ఘోరమైన పాపాన్ని” మంచి మనుషులు మసలే ఈ “సభ్య సమాజం” తో యాక్సెప్ట్ చేయించేలా దర్శకుడు అజయ్ భూపతి తీశాడు కాబట్టి.. ఇది గొప్ప సినిమా అనుకోవాలా ?. ఇక్కడ మరో ఉదాహరణ చెప్పుకోవాలి. బేబీ అనే సినిమాలో ఒక అమ్మాయి ప్రేమించిన వాడితో కాకుండా, వేరే వాడితో పడుకుంది కాబట్టి, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందని వాదించే వారు ఉన్న సభ్య సమాజం ఇది. కావున, ఈ మంగళవారం ఘన విజయాన్ని చూసి ఆశ్చర్యపోవద్దు.

అందేంటో.. ఒక అమ్మాయి మగవాడిని వాడుకుంది అనగానే, ఒక్కోక్కడికి ధర్మాగ్రహం పెల్లుబుకుతుంది. న్యాయ సూత్రాలు, నీతి తత్వాలు, ధార్మిక జీవిత సత్యాలు అన్నీ ఎత్తుతారు. ఆ సినిమాని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అదే ఓ మగాడు మోసం చేస్తే ఏదో పోనీలే అన్నట్టు అది చాలా రెగ్యులర్ కథ అన్నట్టు చూస్తారు. కానీ, ఒక పవిత్రమైన స్త్రీ మూర్తి మాత సమానురాలైన ఆడది సిగ్గు వదిలి అందరితో పడుకుంటే దాన్ని సరికొత్త కంటెంట్ గా చూసే పరిస్థితి ఉంది ప్రస్తుతం. అలాంటి అసభ్య సమాజంలో బ్రతుకుతున్న ఓ స్త్రీ కామ వాంచలతో చేసే పోరాటమే ఈ మంగళవారం సినిమా. అందుకే, ఇది హిట్ అయింది అనడానికి సాహసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా అది నిజమే కావొచ్చు.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్:మధిరలో భట్టికి ఓటమి తప్పదా?

- Advertisement -