పాన్ ఇండియన్ మూవీలో వరుణ్‌.!

78
varun

గద్దల కొండ గణేశ్ తర్వాత కాసింత గ్యాప్ తీసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గని సినిమా చేస్తున్న వరుణ్‌…తర్వాత ఎఫ్‌ 2 సీక్వెల్‌ ఎఫ్‌ 3లో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో పాన్ ఇండియన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రానుందని సమాచారం.

ఇక వరుణ్ నటిస్తున్న మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామా “గని”. ఈ చిత్రం కోసం కండలు పెంచడమే కాదు బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు వరుణ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ సహకారంతో రెనైస్సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో షూటింగ్ కూడా జరుగుతోంది. ఇందులో వెంకటేష్, తమన్నా, మెహ్రీన్ లతో వరుణ్ స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో త్వరలో జాయిన్ కానున్నారు వరుణ్‌.