మెగా అప్డేట్… ముందుగానే ఆచార్య!

106
chiru

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ భారీ బడ్జెట్ మూవీని రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమాలోని రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని వెల్లడించారు మేకర్స్‌. టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఆచార్య త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుందని తెలిపారు.

ఇక సినిమా రిలీజ్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండగానే ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి బరిలోకి ఆచార్య ఉండగా ముందుగా ప్రకటించిన సినిమాల రిలీజ్‌ డేట్ కంటే 10 రోజుల ముందుగా రాబోతోందని తెలుస్తోంది. అంటే 2022 జనవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం.

ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపించనున్నారు. చరణ్ సిద్ధ పాత్రలో నటించనుండగా ఆయన ప్రియురాలిగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.