వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాహీరో..

74
Hero Vaishnav Tej

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. దాంతో వైష్ణవ్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే కథలో కొత్తదనం ఉండి, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఆయన అంగీకరిస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేశాడు.

ఇక మూడో సినిమాను తమిళ దర్శకుడితో చేస్తున్నాడు తెలుస్తోంది. ఆ తరువాత సినిమాను ఆయన అన్నపూర్ణ బ్యానర్లో చేయనున్నాడు. ఈ సినిమా ద్వారా పృథ్వీ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని సమాచారం. ఆ పాత్రకి తగిన విధంగా కొంత శిక్షణ పొందిన తరువాతనే వైష్ణవ్ తేజ్ రంగంలోకి దిగానున్నాడని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లొచ్చని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.