ఏపీలో కొత్తగా 18,561 కరోనా కేసులు నమోదు..

44

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 73,749 కరోనా టెస్టులు నిర్వహించగా 18,561 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 17,334 మంది కరోనా నుంచి కోలుకోగా, 109 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది కన్నుమూశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 14,54,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 12,33,017 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,11,554 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 9,481కి పెరిగింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 3,152 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 2,098 కేసులు, అనంతపురం జిల్లాలో 2,094 కేసులు గుర్తించారు.