హీరో రాజ‌శేఖ‌ర్ కటుంబానికి కరోనా..

22
Rajasekhar

సెల‌బ్రిటీల‌ని సైతం క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది. దీని బారీన పడి కొందరు మరణించగా.. మరికొందరు కోలుకున్నారు. ఇప్పుడు హీరో రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కరోనా సోకినట్టు వెల్లడించారు. ఈ రోజు ఈ విషయంపై తన ట్విట్టర్ ఖాతాలో రాజశేఖర్ స్పష్టతనిచ్చారు.

‘ఈ వార్త నిజమే.. జీవిత, పిల్లలు, నేను కరోనా బారిన పడ్డాము. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారు. నేను, జీవిత కూడా బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి తిరిగొస్తాము.. థాంక్యూ’ అని రాజశేఖర్ స్పష్టంచేశారు.