గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన యాంకర్ రవళి..

34
Anchor Ravali

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని యాంకర్ రవళి తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సింగర్ సాహితి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మొక్కలు యాంకర్ రవళి నాటారు. అనంతరం మరో ముగ్గురు ( యాంకర్ భార్గవ్ , సింగర్స్ అనుదీప్ , రఘురామ్ ) లు మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.