హీరోగా కంటే మంచి మనిషిగా హిట్

28
- Advertisement -

రాఘవ లారెన్స్ కి మంచి మనిషి అని పేరు ఉంది. దీనికితోడు లారెన్స్ యాక్టర్ గా హిట్, -కొరియోగ్రాఫర్ గా హిట్, ఫిల్మ్ మేకర్ గా హిట్. అందుకే.. రాఘవ లారెన్స్ సినిమాల కోసం సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పై తమిళంలో భారీ బజ్ ఉంది.

అయితే, మరి తెలుగు పరిస్థితి ఏమిటి ?, ఇప్పటివరకు ఈ సినిమా పై వచ్చిన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయని.. అయితే, ఫుల్ ఫన్ ఉండటంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఫన్ ను ఇస్తోంది అని టాక్ నడుస్తోంది. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయట. మరి ఈ సినిమా రాఘవ లారెన్స్ కి ఏ రేంజ్ హిట్ ను ఇస్తోందో చూడాలి.

లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ ఎల్‌ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి.. రుద్రుడు హిట్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఏది ఏమైనా లారెన్స్ మాత్రం హీరోగా కంటే, మంచి మనిషిగా సూపర్ హిట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి…

Naga Chaitanya:కస్టడీ ఫస్ట్ సింగిల్

Prabhas:సలార్ టీజర్ అప్పుడే!

ప్రభాస్ కాదు..ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆరే

- Advertisement -