ఈడీ విచారణలో థర్డ్ డిగ్రీ: ఎంపీ సంజయ్

41
- Advertisement -

ఈడీ విచారణలో థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తుందన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. మీడియాతో మాట్లాడిన దేశంలో ఈడీ ఎలా పనిచేస్తుందో వివరించారు. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి బిడ్డ, తల్లి, కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇటీవలే చందన్ రెడ్డి హై కోర్ట్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు..ఈడీ అధికారులు కొట్టారు, కుటుంబ సభ్యులను బెదిరించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

చందన్ రెడ్డి రెండు చెవులు వినిపించడం లేదు… కొట్టడం ద్వారానే చెవులు వినపడడం లేదని డాక్టర్లు ధృవీకరించారన్నారు. అరుణ్ పిళ్ళై భార్య, బిడ్డ, కుటుంబ సభ్యులను భయాందోళన గురిచేస్తున్నారు…ఇదే అంశాన్ని న్యాయస్థానంకు లేఖ రాశారన్నారు. సమీర్ మహేంద్రు భార్యను పిలిచి… ఆమెను, కుటుంబ సభ్యులను ఇలానే భయాందోళనకు గురి చేశారన్నారు. న్యాయస్థానం ముందు సమీర్ మహేంద్రు ఇవన్నీ చెప్పాడు..మరో ఇద్దరు కూడా ఈడీ అధికారులు బెదిరిస్తున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారని న్యాయస్థానంకు లేఖ రాశారన్నారు.

మాగుంట రాఘవ రెడ్డి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు.. రాజకీయ నేతల పేర్లు చెప్పాలని భయాందోళనకు గురిచేస్తున్నారని చెప్పారన్నారు. ఎవరి కోసం, ఎవరి ఆదేశాల మీద ఈడీ పనిచేస్తోందన్నారు.ఈడీ విచారణలో కొట్టింది… అధికారులు కూడా కాదు… అసలు ఈడీ కార్యాలయంలో ఉంది ఎవరు అని ప్రశ్నించారు. చందన్ రెడ్డి చెప్పిన అంశం హై కోర్ట్ లో ఉంది. ఎనిమిదేళ్లలో ఈడీ 3000కు పైగా కేసులు నమోదు చేస్తే శిక్ష పడ్డవి కేవలం 0.5% మాత్రమే అన్నారు.

తనకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు…ఈడీ అందరూ అధికారులకు చెప్తున్న…ఈ అంశాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకువెళ్తా అన్నారు. అసలు లిక్కర్ స్కామ్ లేదు… ఈడీ అలా చేసిందన్నారు. గన్ పాయింట్ లో పెట్టి అబద్ధాలు చెప్పిస్తున్నారు.ఢిల్లీ ప్రభుత్వం, ఆప్ ను బద్నాం చేసేందుకే లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -