Prabhas:సలార్ టీజర్ అప్పుడే!

44
- Advertisement -

దర్శకుడు ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను జూన్ చివరి వారంలోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా యాక్షన్ సీన్స్ అన్నీ ఈ టీజర్ లో ఉండనున్నాయట. జూన్ 16న ‘ఆదిపురుష్’ రిలీజ్ అయిన కొద్ది రోజులకే ‘సలార్’ టీజర్ రాబోతుంది.

ఇప్పటికే ఈ సలార్ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. అందుకే, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమా రైట్స్ పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. సలార్ ఏపీ రైట్స్‌ కోసం ఏకంగా రూ.100 కోట్ల ఆఫర్లు వస్తున్నాయట. నిజంగా ఇది సలార్ సృష్టించిన రికార్డే. మరి ఒక్క ఏపీ రైట్స్ కోసేమే అంత భారీ మొత్తం అంటే.. ఈ లెక్కన సలార్ చిత్ర వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లకు పైగా అమ్ముడు పోయే అవకాశం ఉంది.

మొత్తానికి ప్రశాంత్ నీల్ – ప్రభాస్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉన్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రభాస్ పార్ట్ దాదాపు పూర్తి అయ్యింది. ఓ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఈ సాంగ్ ను కూడా త్వరలోనే షూట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -