ప్రభాస్ కాదు..ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆరే

38
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్‌’తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా చేయబోతున్నాడు. ఐతే, ఈ పాత్ర కోసం మొదట ప్రభాస్‌ ను సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం కారణంగానే చివరకు వార్ 2 టీమ్ ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యారని టాక్ నడుస్తోంది. అయితే, ఈ వార్తలు సరికాదని.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మాత్రమే ఏకైక ఎంపిక అని బాలీవుడ్ మీడియా స్పష్టం చేసింది.

ఈ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా మొదటి నుంచి ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు అని, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే పోరాటంగా వార్ 2 రూపొందించనున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ తో గత 5 నెలలుగా చర్చలు జరిపారు. ఎన్టీఆర్ ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. తన మిత్రుడు కొరటాల శివను కూడా స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ చేసి.. తన పాత్ర పై పూర్తి క్లారిటీ తర్వాతే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మార్చిలోనే వార్ 2 ఓకే అయింది.

హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండనుంది. ఈ సినిమాకు జూ.ఎన్టీఆర్ రూ.160 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడు. మొత్తానికి హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్ గా హృతిక్ కి – ఎన్టీఆర్ కి పేరు ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.. కచ్చితంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుంది. పైగా హృతిక్‌ తో క‌లిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటే.. ఎన్టీఆర్‌కు గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ ద‌క్కినట్టే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -