మధ్య అరేబియా సముద్రం, గోవా లోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక మరియు రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉంది.
తదుపరి 48 గంటలలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు, రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రాలో మిగిలిన ప్రాంతాలు, బంగాళాఖాతం మరియు ఈశాన్య భారతదేశం లో మిగిలిన ప్రాంతాలు, సిక్కిం, ఒరిస్సా మరియు గాంగేటిక్ పశ్చిమబెంగాల్ లో కొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.
తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అదే ప్రాంతంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటలలో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉంది.ఉత్తర ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు చాలాచోట్ల ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు మహబూబ్ నగర్, నారాయణపేట,జోగులాంబ గద్వాల్,నగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ మరియు సూర్యపేట జిల్లాలలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.