- Advertisement -
బెంగళూరుని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో బెంగళూరు నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ మునిగిపోయాయి.మరో ఐదు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వరదకు ఇళ్లలోని వస్తువులు, బైకులు కొట్టుకుపోయాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు అపార్ట్ మెంట్లు, సెల్లార్లలోకి నీరు చేరింది. నీటిలో వాహనాలు మునిగాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరులో 1700 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. బెంగళూరు సిటీలో ఇంత భారీ స్థాయి వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారి.
- Advertisement -