కర్ణాటకలో భారీ వర్షాలు..రెడ్ అలర్ట్

50
karnataka

భారీ వర్షాల నేపథ్యంలో కర్ణాటకలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అరేబియా సముద్రతీరంలో గంటకు 55 కిలోమీటర్ల వేగం గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కర్ణాటక కోస్తా జిల్లాల్లో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు.

బెంగళూరు అర్బన్, రూరల్, బళ్లారి, చిత్రదుర్గ, చిక్కాబళ్లాపుర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.రాగల 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాల్లో భారీవర్షాలు కురవగా.. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భాగమందాల జిల్లాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పనంబూర్, కోట, ఉడుపి, కొడగు, శివమొగ్గ, మంగళూరు, సుబ్రమణ్య, గోకర్ణ, మణీ, ఔరాద్ ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.