భాగ్యనగరంలో భారీ వ‌ర్షం..

31

రాష్ట్ర‌ంలో నైరుతి రుతుప‌వ‌నాలు రాకతో పలు చోట్ల వ‌ర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో కుండపోత వ‌ర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, బాలాన‌గ‌ర్, సికింద్రాబాద్, తార్నాక‌, ఓయూ, రామ్‌న‌గ‌ర్‌, విద్యాన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, అంబ‌ర్‌పేట‌, ల‌క్డీకాపూల్, మోహిదీప‌ట్నం, మ‌ల‌క్‌పేట‌, కోఠి, ఖైర‌తాబాద్‌, సోమాజిగూడ‌లో వ‌ర్షం కురిసింది.

ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. రాష్ట్ర‌మంతా నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌డంతో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఒక‌ట్రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురియ‌నున్నాయి.