రాష్ట్రంలో భారీ వర్షాలు.. సూర్యాపేట జలమయం..

70
- Advertisement -

గత మూడు రోజులగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షంతో సూర్యపేట జిల్లా జలమయమైంది. జిల్లా కేంద్రంలోని పలు వార్డులు, పలు కాలనీలు నీటమునిగాయి. నెహ్రు నగర్, మానస నగర్, వెంకటేశ్వర కాలనీ, గోపాలపురం, ఆర్కే గార్డెన్స్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది, జిల్లా కేంద్రంలోని చౌదరి చెరువు అలుగు పోస్తున్నది.

సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డితో సమీక్షా, రెస్క్యూ చర్యలు చేపట్టాలంటూ మున్సిపల్, రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -