కేశ సౌందర్యం కోసం చిట్కాలు…..

197
long hair

ఆలివ్ ఆయిల్ జుట్టుకు అవసరం అయ్యే తేమను ,పోషకాలను అందిస్తుంది, లోత్తైన కండీషనర్ గాను ఉపయోగపడుతుంది

ఆలివ్ ఆయిల్ కేశలకు బలాన్ని ఇస్తుంది. చుండ్రును నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ కు రెండు టీ స్పూన్ ల తేనె మిక్స్ చేసి తలకు రాసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది.

బాదాం నూనె లో విటమిన్ “ఇ” పుష్కలంగా ఉండటం వల్ల కేశల పెరుగుదలకు సహాయపడుతుంది. త్వరగా జట్టు పెరగాలనుకునే వారు బాదం నూనె ను ప్రతి రోజు తలకు పట్టించాలి.

health tips for hair

కొబ్బరి నూనె జుట్టు మందం గా పెరగడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ సెప్టిక్ లక్షణాలుంటాయి కావునా ఇది జుట్టు రాలడాని నివరిస్తుంది.

నువ్వుల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది,దీనితో జుట్టు పెరగడం ప్రారంభమౌతుంది

కోడ్డిగుడ్డు తెల్లసోనలో మెంతిపోడి బాగా గిలక్కొట్టి తలకు రాసుకొని అరగంట తర్వాత తలంటుకుంటే చుండ్రు,దురద ఉండవు

మందార ఆకుల్ని బాగా రుబ్బి తలకు పట్టించుకొని 20 నిమిషాల తరువాత కడుక్కోని తలంటుకుంటే జుట్టు నల్లగా ,మృదువుగా తయారవుతుంది.

పాల ఉత్పత్తలు ,గుమ్మడి విత్తనాలు లాంటివి ఎక్కువ తీసుకొవడం వల్ల శరీరానికి కావలసిన జింక్ దొరికి తలలో చుండ్రు నివారిస్తుంది.

health tips for hair

ఆరోగ్యవంతమైన జట్టు కొసం ప్రతి రోజు ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకొవాలి. వీటిలో విటమిన్ సి, ఐరన్ లు ఎక్కవ ఉంటాయి. ఇవి జట్టు కుదుళ్లను బలంగా చేసి , జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

సీతాఫలం గింజలను మెత్తగా పొడిచేసి తలకు పట్టించి ఆరాక స్నానం చేస్తే తలలో చుండ్రు తగ్గటమే కాకుండా పేలు కూడా పోతాయి.