వెంకీ కొత్త సినిమా అప్పుడే !

3623
- Advertisement -

విక్టరీ వెంకటేష్ గతేడాది ‘ఎఫ్ ౩’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏంటనేది చెప్పలేదు వెంకీ. ఇటీవలే విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ లో మోడ్రన్ గాడ్ గా కనిపించిన వెంకటేష్ ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలో అన్నయ్య పాత్ర చేస్తున్నాడు. వెంకీ నెక్స్ట్ లిస్టులో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఫైనల్ గా శైలేష్ తో వెంకీ నెక్స్ట్ సినిమా ఉండనుందని తెలుస్తుంది.

శైలేష్ కొలను రీసెంట్ గా హిట్ 2 కి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హిట్ , హిట్ 2 రెండూ శైలేష్ కి తెలుగులో దర్శకుడిగా సక్సెస్ అందించాయి. ఇటీవలే వెంకటేష్ కి శైలేష్ కథ చెప్పి లాక్ చేసుకున్నాడని ఇన్ సైడ్ న్యూస్. ఈ కాంబో సినిమాను నిహారికా ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించబోతున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 26 న రిపబ్లిక్ డే రోజు ఈ కాంబో సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

పవిత్ర నరేష్ వీడియో వైరల్

డిసెంబర్‌30…వీరయ్య పూనకాలు

నాగార్జునతో నరేష్ ఫిక్స్ ?

- Advertisement -