అక్రిడేషన్‌తో సంబంధం లేదు..ఐడీ కార్డు ఉంటే టీకా

30
ts

జర్నలిస్టుల అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా సంస్థ ఐడి కార్డు ఉన్న జర్నలిస్టులు వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. నిన్న అక్రిడేషన్ ఉన్న కార్డు జర్నలిస్టులకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ తెలపడంతో చాలామంది జర్నలిస్టులు ఆందోళనకు గురయ్యారు.

దీంతో అక్రిడేషన్‌పై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస రావు. అక్రిడేషన్ కార్డు తో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టు వ్యాక్సిన్ ఇవ్వాలని 28, 29 తేదీలతో పాటు మరో ఐదు రోజుల పాటు వ్యాక్సిన్ సమయం పెంచాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కోరగా దీనికి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఒప్పుకున్నారు. సంస్థ ఐడి కార్డ్, ఆధార్ కార్డుతో వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని వెల్లడించారు.