రూమర్స్ నమ్మకండి: మహేశ్ బాబు

47
mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కార్ వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి గాసిప్స్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతుండగా వాటికి చెక్ పెట్టారు మహేశ్‌ బాబు. సర్కార్ వారి పాట ఫస్ట్ లుక్ మే 31న రిలీజ్ అవుతుందన్న వార్తల్లో నిజం లేదని అలాంటి వాటిని నమ్మవద్దన్నారు. మే 31న ఎలాంటి అప్‌ డేట్ ఉండదని చెప్పారు మహేశ్.