సూపర్ స్ప్రెడర్లకు టీకా..సర్వం సిద్ధం

38
vaccine

హైదరాబాద్​లో సూపర్ స్ప్రెడర్లకు శుక్రవారం నుంచి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటివరకు అధికారులు సేకరించిన డేటా ప్రకారం నేటి నుండి టోకెన్లు జారీ చేయనున్నారు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన స్ట్రీట్ వెండర్స్, చికెన్, ఫిష్, కూరగాయల అమ్మకం దారులు, కిరాణ, వైన్స్, సెలూన్స్, లాండ్రీ, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్స్ సిబ్బంది, ఆటో, క్యాబ్​ డ్రైవర్లకు ప్రయార్టీల వారీగా టీకాలు ఇవ్వనున్నారు.

ఇందుకోసం 32 సెంటర్స్ ఏర్పాటు చేయగా ఫంక్షన్​ హాల్స్, మల్టీపర్పస్​ హాల్స్, స్కూల్స్, స్టేడియాలను వినియోగించనున్నారు. ఏ సెంటర్​లో, ఎన్ని గంటలకు టీకా వేస్తారనే విషయాలను టోకెన్​ ఇష్యూ టైమ్​లోనే వెల్లడించనున్నారు.

10 రోజుల పాటు దాదాపు 3 లక్షల మందికి టీకాలు వేయనుండగా ఒక్కో సెంటర్​లో డైలీ వెయ్యి మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు.