కరోనా కట్టడికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ విరాళం..

41

కరోనా కట్టడికి తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ వంతు సాయం అందించింది. కరోనా కష్టకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 1.55 కోట్లు విరాళ‌ం అందించింది. ఈ మేర‌కు హెచ్‌డీఎఫ్‌సీ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భ‌టియా, తెలంగాణ స్టేట్ హెడ్ శ్ర‌వ‌ణ్ కుమార్ క‌లిసి మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందించారు. ఈ సంద‌ర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్ర‌తినిధుల‌కు మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.