హ్యాక్‌డ్‌ బై డెవిల్‌ (హెచ్‌బిడి) ఆడియో

115
HBD- Hacked by Devil Movie Audio Release

లాగిన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై మేఘన, సంతోషి, సల్మాన్‌, హిమజా ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్‌ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌. వై నిర్మించిన హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘హ్యాక్‌డ్‌ బై డెవిల్‌’ (హెచ్‌బిడి). ఈ చిత్రం యొక్క బిగ్‌ సీడీని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ రామకృష్ణ గౌడ్‌ ఆవిష్కరించగా.. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు వీరేంద్రగౌడ్‌లు ఆడియో సీడీని ఆవిష్కరించారు. మహీ మదన్‌ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత సాయి వెంకట్‌, డైరెక్టర్‌ సముద్ర, వై. బాలరాజు గౌడ్‌, పి. నాగేశ్వరావు, దర్శకుడు కృష్ణకార్తీక్‌, మేఘన, సంతోషి, సల్మాన్‌, డిఓపి కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వినయ్‌గౌడ్‌ వై, నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. వై తదితరులు పాల్గొన్నారు.

HBD- Hacked by Devil Movie Audio Release

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణకార్తీక్‌ మాట్లాడుతూ..మా ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం వర్క్‌ పరంగా అందరినీ ఎంతగానో ఇబ్బంది పెట్టాను. అందరూ నాకు ఎంతగానో సహకరించారు. సహకరించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా నా తల్లిదండ్రులకి..అలాగే నన్ను నమ్మి..నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత ఉదయ్‌భాస్కర్‌కు జీవితాంతం ఋణపడి ఉంటాను. మహీమదన్‌ మంచి పాటలతో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. నా ఈ తొలి ప్రయత్నానికి సహకరించిన అందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను…అన్నారు.

HBD- Hacked by Devil Movie Audio Release

చిత్ర నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. వై మాట్లాడుతూ..మేము ఒక టీమ్‌లా ఏర్పడి లాగిన్‌ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇకపై ఇదే బ్యానర్‌లో మంచి మంచి సినిమాలు తెరకెక్కిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. దర్శకుడు కృష్ణకార్తీక్‌..టెక్నికల్‌గా మంచి సినిమా నాలెడ్జ్‌ ఉంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. మా ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని, అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..అన్నారు.

HBD- Hacked by Devil Movie Audio Release

మేఘన, సంతోషి, సల్మాన్‌, హిమజ, మానస, సురేష్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహీ మదన్‌ యం.యం, డిఓపి: కన్నా కోటి, ఎడిటర్‌: కె.ఆర్‌. స్వామి, డైలాగ్స్‌: అభయ్‌ శ్రీజయ్‌, పాటలు: రాజ్‌కుమార్‌-రాకేష్‌; కో-డైరెక్టర్‌: రమేష్‌ పోలే, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: మల్లిక్‌. యం, కో-ప్రొడ్యూసర్‌: వినయ్‌ గౌడ్‌. వై, నిర్మాత: ఉదయ్‌భాస్కర్‌. వై, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కృష్ణకార్తీక్‌.