తేజ్ ఆడియోకి అతిథిగా సైరా..

198
Sai Dharam Tej

సాయి ధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తేజ్‌ ఐ లవ్ వ్యూ’. కరుణాకరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్నారు. సీసీ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి సన్నాహాలు చేస్తున్నారు.

Sai Dharam Tej

అయితే ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను జరపనున్నారు. అంగరంగవైభవంగా జరగనున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తేజ్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘నువ్వు నా ప్రపంచం. థాంక్యూ మామా’ అని పేర్కొన్నారు.

ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బాణీలు ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తోన్న సాయిధరమ్ తేజ్ కి, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి. జూన్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.