అఖిల్‌ ‘హలో’ ఆడియో రిలీజ్..!

163
Akhil's Hello Audio Launch In Vizag

కింగ్‌ నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్‌’ కోసం ఎంత కష్టపడినా ఇతర కారణాలు అతని కెరీర్ ని దెబ్బ కొట్టాయి. కానీ సెకండ్ మూవీ ‘హలో’ తప్పకుండా హిట్ కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అఖిల్‌ ఈ సినిమా కోసం కూడా చాలా కష్టపడుతున్నాడనే చెప్పాలి. అంతేకాదు తండ్రి నాగార్జున కూడా ‘హలో’ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘హలో’ సినిమా తెరకెక్కింది. కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమలో కథానాయికగా నటిస్తుంది.

Akhil's Hello Audio Launch In Vizag

ఇకపోతే నాగార్జున ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని హై రేంజ్‌కి పెంచుతున్నాడు. సినీ తారల హెల్ప్ కూడా తీసుకుంటున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో మరో పెద్ద బాధ్యతని నాగ్ ఫేస్ చేయబోతున్నారు. అదే ఆడియో వేడుక. సినిమా రేంజ్ ని మరో మెట్టు ఎక్కించాలంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చాలా ముఖ్యం. ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఆడియో రిలీజ్ ను వైజాగ్ లో జరపాలని నాగార్జున నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. గతంలో విక్రమ్ కుమార్ .. అనూప్ రూబెన్స్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇష్క్’ .. ‘మనం’ సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అందువలన ఈ సినిమా ఆడియో కూడా యూత్ మనసులు కొల్లగొట్టేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక పాటను అఖిల్ పాడటం విశేషం. ఈ పాటను ఆయన వైజాగ్ వేదికపై కూడా పాడనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.