నియంత్రిత సాగుతో రైతులకు లాభాలు: మంత్రి హరీశ్ రావు

256
harishrao
- Advertisement -

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లోని శివంపేట మండలం కొత్తపేట , రత్నాపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డ్ ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు . అంతకుముందు కొత్తపేట గ్రామంలో మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు. అలాగే రత్నాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి హరీష్ రావు .

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి , నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు , నాయకులు ,మండల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులను రైతుబంధు వచ్చిందా లేదా అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు .

తమ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు . అలాగే పొలాలు నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఏ పంటలు వేస్తున్నారు , పంట నియంత్రిత సాగు వల్ల రైతులకు కలిగే లాభాలను మంత్రి వివరించారు . రైతులు వేసే పంటలకు సంబంధించిన వివరాలను గ్రామాల్లో చర్చించుకుని ఈ పంటలు వేయాలని అంశాలను చర్చించి కొనేందుకు రైతు వేదికల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని మంత్రి రైతులకు తెలియజేశారు.

- Advertisement -