జీఎస్టీతో ఆదాయాన్ని కొల్పోతున్న రాష్ట్రాలు..

119
gst
- Advertisement -

జీఎస్టీతో ప్రతిఏటా రాష్ట్రాలు ఆదాయాన్ని కొల్పోతున్నాయని వెల్లడించారు మంత్రి హరీశ్‌ రావు. 43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన..తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.3,439. కోట్లు అంటే 2,102 శాతం ఆదాయం కోల్పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాద‌న్నారు. ఆల్కహాల్ ను అన్ని రాష్ట్రాల మంత్రులు కోరుతున్నట్లు జీఎస్టీ నుండి మినహాయించాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. జీఎస్టీలో‌ చేర్చితే రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయి.. జీఎస్టీ పరిధి నుండి శాశ్వతంగా న్యూట్రల్ ఆల్కహాల్ నుమినహాయించేలా నిర్ణయం తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేన‌ని.. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జిలరూపంలోనే అన్నారు. రాష్ట్రాలు 1.64 లక్షల కోట్లు అంటే 41 శాతం ఆదాయం కేంద్రం వసూలు చేస్తోన్న సెస్ లు , సర్ ఛార్జిల ద్వారా కోల్పోతున్నాయ‌ని వెల్లడించారు హరీశ్‌ రావు.

- Advertisement -