ప్రజా ప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా?

10
- Advertisement -

మాది ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకునే భట్టి విక్రమార్క గారూ.. బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వస్తే ఎందుకు పోలీసులను అడ్డు పెట్టుకొని వెనుక గేటు నుంచి వెళ్లిపోయారు. ఎందుకు ముఖం చాటేసారు? చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా ప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ కమిషన్ల కక్కుర్తి నేడు సచివాలయం సాక్షిగా బట్టబయలైంది. తమ పెండింగ్ బిల్లుల పై సర్పంచ్ లు రోడ్డెక్కినా కాంగ్రెస్ ప్రభుత్వం కరుణించడం లేదు ..కానీ కమీషన్ల కు ఆశపడి మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం కాంట్రాక్టర్ల సచివాలయంలో చేసిన ఆందోళనతో నిరూపితమైంది .
పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 6 వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఆ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.

కాంట్రాక్టర్ల తరహాలోనే ఉద్యోగులు కూడా తమ బకాయిలు తాము పొందేందుకు కమిషన్లు ఇవ్వాల్సిందేనా? బకాయిలు చెల్లించాలంటూ కొందరు సెల్ఫీలు తీసి వీడియోలు పెడితేనో, కోర్టులకు వెళ్తేనో ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నారు తప్ప నిబంధనల ప్రకారం రావాల్సిన వాటిని కూడా పెండింగ్ లో పెడుతున్నారు.ఢిల్లీలో తమ బాస్ లకు కప్పం కట్టేందుకు అన్ని వర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని లోకం కోడై కూస్తోంది. కాంట్రాక్టర్లు ఈ రోజు సచివాలయంలోని ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు చేసిన ధర్నాఆ లంచాల ఆరోపణలు నిజమే అని నిరూపించిందన్నారు.

20% కమిషన్ తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లే స్వయంగా సచివాలయానికి వచ్చి ధర్నా చేయడం గతంలో కనీ విని ఎరుగని ఘటన. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు మాయని మచ్చ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కాములు, కమిషన్ల ప్రభుత్వమని మరోసారి రుజువు అయింది. రాహుల్ గాంధీ తాను చెప్పే నీతి సూత్రాలపై ఏమాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే సచివాలయంలో కాంట్రాక్టర్లు మంత్రులపై చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించాలి.కాంట్రాక్టర్లు చేస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలి అన్నారు.

Also Read:రాష్ట్రంలో RR ట్యాక్స్: హర్షవర్థన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పోరాడుతుంది. ప్రతి వేదిక మీద కాంగ్రెస్ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం.బడా కాంట్రాక్టర్లకు కమీషన్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్ లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆపడం అన్యాయం. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం అమానుషం. తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి.పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక శాఖ నుంచి జరిగిన అన్ని చెల్లింపుల పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

 

- Advertisement -