5 ఆస్పత్రుల కోవిడ్ లైసెన్స్ రద్దు..

201
virinchi
- Advertisement -

కరోనా చికిత్స పేరిట కార్పొరేట్​, ప్రైవేట్​ ఆస్పత్రులు చేస్తున్న దోపిడికి అద్దుఅదుపు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను కాదని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. కనీసం లక్షన్నర అడ్వాన్స్ కడితేనే పేషెంట్స్ ను చేర్చుకుంటున్న ఆస్పత్రులు అనంతరం వారి నుండి లక్షల్లో వసూలు చేస్తూ ప్రజల ఆసరాను క్యాష్ చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో అన్నివర్గాల ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడిపై సీరియస్ అయింది. ఇప్పటికే పలు ఆస్పత్రులకు షోకాజ్ నోటీస్ జారీ చేయగా తాజాగా ఐదు ఆస్పత్రుల కోవిడ్ లైసెన్స్ రద్దు చేసింది. ఇందులో విరించి, విన్, tx, నీలిమ, మాక్స్ హెల్త్ ఆస్పత్రులు ఉన్నాయి.

- Advertisement -