ఫరీదుద్దీన్ మృతి పట్ల మంత్రుల సంతాపం..

15
fariduddin

మాజీ మంత్రి ఫరీదుద్ధీన్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఎమ్మెల్యేగా, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా,ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రజలకు విశేష సేవలందించారని గుర్తుచేశారు. మెదక్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం ఉందని….ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ మంత్రి ఫరీదుద్ధీన్ మరణం పట్ల హోం మంత్రి మహమూద్ అలీ సంతాపం వ్యక్తం చేశారు. తనతోపాటు ఎం ఎల్ సి గా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారని…మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించి మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేశారని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని…కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.