మాజీమంత్రి ఫరీదుద్దీన్ మృతి..

110
fariduddin
- Advertisement -

మాజీ మంత్రి, టిఆర్ఎస్ మైనార్టీ నేత ఫరీదుద్దీన్ అనారోగ్యంతో చికిత్స పొందుతు కన్నుమూశారు.కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన… వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో చేరారు.పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.ఫరీదుద్దీన్ కు భార్యా, కూతురు, కొడుకు ఉన్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం హోతి (బీ) ఫరీదుద్దీన్ స్వగ్రామం. గ్రామ స్థాయి నేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తిరుగులేని నేతగా ప్రజల్లో అభిమానాన్ని చూరగొన్నారు.1998లో రాజకీయాల్లో అడుగు పెట్టి హాతి(బీ) సర్పంచ్ గా ఎన్నికయ్యారు.ఆ తర్వాత అందివచ్చిన అవకాశంతో జహీరాబాద్‌‌ 1999,2004 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

2009లో జహీరాబాద్ ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఫరీదుద్దీన్ కు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. తర్వాత టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా సేవలందించారు. అనంతరం టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.సిఎం కేసీఆర్ ఆశ్శీస్సులతో ఎమ్మెల్సీ దక్కించుకున్నారు.జహీరాబాద్ లో తిరుగు లేని నాయకుడిగా ఉన్న ఫరీదుద్దీన్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆయన స్వగ్రామం హాతీ(బీ)లో ముస్లిం సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి.

- Advertisement -