సిద్దిపేట 100 శాతం ఫలితాలు సాధించాలి:హరీష్

12
- Advertisement -

సిద్దిపేట నియోజకవర్గం100 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలోనే నిలవాలని ఆకాంక్షించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట గర్ల్స్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణి చేశారు.

ఈ ఏడాది నియోజకవర్గంలోని 2516 మంది పదవ తరగతి విద్యార్థులకు కేసిఆర్ డిజిటల్ కంటెంట్ ఈబుక్స్ పంపిణి చేస్తాం. డిజిటల్ కంటెంట్ పుస్తకాలతో పాఠాలు సులభంగా అర్థమవుతాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.

కష్టంతో కాదు ఇష్టంతో చదివి మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని.. ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన సూచనలు ఇచ్చి చదువులో రాణించేలా చూడాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గం 100 శాతం ఫలితాలు సాదించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవాలని నా తాపత్రయం అన్నారు.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -