వావ్.. మహేష్ సరికొత్త గెటప్

17
- Advertisement -

దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో మరో సరికొత్త ప్రపంచపు సినిమా సృష్టిస్తున్నాడు. ఈ సినిమా షూట్ మరో నాలుగు నెలల్లో స్టార్ట్ కానుంది. ఐతే, ఈ సినిమాలో కొంత పార్ట్ కోసం హీరో మహేష్ బాబు ఒక కొత్త గెటప్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలోని కొంత పార్ట్ లో కనిపించే ఈ గెటప్ కోసం మహేష్ గెడ్డం, మీసాలు బాగా పెంచినట్లు కనిపిస్తోంది. ఈ గెటప్ లో షూట్ వున్నందు వల్లే ప్రస్తుతం మహేష్ బయట కనిపించడం లేదు. ఈ గెటప్ సినిమాలో ప్రత్యేకంగా వుంటుందని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ గెటప్ తో ముప్పై రోజులు షూట్ తరువాత మహేష్ బాబు మళ్లీ గెడ్డం తీసి.. మరో గెటప్ కోసం కసరత్తులు చేస్తాడట. మొత్తంగా రాజమౌళి సినిమాలో మహేష్ బబు రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి `వీర` అనే టైటిల్ ను దాదాపుగా ఖ‌రారుచేశారని టాక్ నడుస్తోంది. అన్నట్టు ఈ సినిమా ఓ సోషియోఫాంట‌సీ క‌థతో సాగుతుందట. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి బోలెడు పుకార్లు వినిపించాయి.

అందులో ప్రధానంగా మహేష్ బాబు.. ఆఫ్రికాలో అడుగు పెట్ట‌బోతున్నాడు. అక్క‌డ మ‌నుషులు, వాతావ‌ర‌ణం, చెట్లూ, చేమ‌లూ అన్నీ కొత్త‌గా ఉండ‌బోతున్నాయట. ఓర‌కంగా చెప్పాలంటే.. మరో బాహుబలి లాంటి క‌థ‌న్న‌మాట‌. బాహుబలి లో కూడా అంతే. రాజమౌళి ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు మహేష్ తో అలాంటి సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కనిపించనుంది అని చాలా రోజులుగా క్రేజీ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మరి నిజంగానే మహేష్ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తే.. కాంబినేషన్ అదిరిపోతుంది.

Also Read:కాలీఫ్లవర్‌ తో బరువుకు చెక్..!

- Advertisement -