KCR:పోరాటాల చరిత్ర బీఆర్ఎస్‌ది

15
- Advertisement -

తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది.

ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీ లకు స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగు లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదేనన్నారు.

ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీ లు…రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి…వీరితో పాటు కేటీఆర్ హరీష్ రావు లు పాల్గొన్నారు.

Also Read:వావ్.. మహేష్ సరికొత్త గెటప్

- Advertisement -